మాక్ పార్లమెంట్ లో ఏర్గట్ల విద్యార్థిని ప్రతిభ
ఏర్గట్ల, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల కార్యక్రమంలో కిశోర బాలికలల మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా మండలం లో ఐకెపి ఆధ్వర్యంలో 16 కిషోర బాలిక సంఘాలు ఏర్పాటు చేయగా అందులోంచి నూనె శ్రీనిధి, అశ్విని, సుహానా పర్వీన్ లను మార్క్ పార్లమెంట్ కార్యక్రమానికి ఎంపిక చేసి పంపించినట్లు ఐకెపి మండల ఏపిఎం కుంట...