బడిబాట లో ఏర్గట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు

బతుకమ్మ, ఏర్గట్ల: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, ఏర్గట్ల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను తెలుపుతూ, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని,డిజిటల్ తరగతులను కూడా బోధిస్తున్నామని,విజ్ఞాన విహార యాత్రలు చేపడుతున్నామని, సాంస్కృతిక కళా రంగాలలో విద్యార్థులు చక్కని విజయాలు సాధిస్తున్నారని, ఆటపాటలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ముందంజలో ఉన్నారని తెలుపుతూ,విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువమంది...