సమిష్టి కృషితోనే క్షయ వ్యాధి నిర్మూలన
టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో అందరూ భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ టీ.బీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపు నిజామాబాద్, బతుకమ్మ : క్షయ వ్యాధి రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో టీబీ...