Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2025, 6:40 pm Posted by : ramakrishna

బాల్యవివాహాలను నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత

  • కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ : బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి అన్నారు. సాధన ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ ప్లెడ్జ్ వీకెండ్ టు ఎండ్ చైల్డ్ మ్యారేజ్ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ్యులు వెంకట రమణ రెడ్డి పాల్గొని బాల్యవివాహ నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  బాలికల విద్యాభివృద్ధి, భవిష్యత్తు రక్షణకు ఇది ఒక ముఖ్యమైన అడుగు అవుతుందని తెలిపారు. చిన్నారుల హక్కులను కాపాడేందుకు సమాజం అంతా కలసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గిరిజా, మమత, సంధ్య రాణి, విశ్వ జ్యోతి సీఎస్ఎం లు పాల్గొన్నారు.