Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 11:53 pm Posted by : ramakrishna

వ్యాపారవేత్తలు వర్సెస్ పట్టభద్రులు

  • పట్టభద్రుల ఎన్నికల్లో విచిత్రం
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడుగుతున్న కోటీశ్వరులు
  • చట్టసభలకు ఎన్నికైతే ప్రశ్నించే గొంతుకలవుతారా?
  • గెలిచేందుకు కోట్లు కుమ్మరిస్తున్న వైనం
  • గెలిచిన తర్వాత పార్టీ చెప్పినట్లే వింటారని అనుమానాలు

 

కరీంనగర్, బతుకమ్మ  : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నిక  రసవత్తరంగా మారింది. ఈ నెలలో నోటిఫికేషన్ రాగా నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పరిశీలన పూర్తి కాగా దాదాపు 50 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు  పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నాయి. మొన్నటి వరకు నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యమకారులు బరిలో ఉంటారని చర్చ జరుగగా ప్రస్తుతం రాజకీయ చత్రం కోసం ఆశిస్తున్నా వారు బరిలో నిలిచి  ఉండడం కొసమెరుపు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు తీసిపోని విధంగా ఎన్నికల కోలాహలం మొదలయింది. పట్టభద్రుల నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారులు, మేధావులు, నిరుద్యోగులు బరిలో ఉండగా వారందరినీ వెనక్కినెడుతూ కోటిశ్వరులు ఓట్లు అడుగడం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఫరీత్యంగా పేర్కొంటున్నారు. 42 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్న ఎన్నికలు కోటిశ్వర్లు తమకు ఓట్లు వేసి గెలిపించాలని కోరడమే విచిత్రంగా  చెబుతున్నారు. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలు తీర్చేవారు ఉద్యమకారుల్లో గతంలో ఎన్నికల్లో నిలిచి ఓట్లు అడిగే వారు ఈసారి మాత్రం కోట్లకు పడగలెత్తి తమకు రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు బరిలో నిల్చుండడంపై చర్చ  జరుగుతుంది. ఎన్నికల అఫిడవిట్ లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ,ఒక స్వతంత్ర అభ్యర్థి ఆస్తులు కోట్ల రూపాయలుగా చూయించారు. స్వతంత్ర అభ్యర్థి ఒక్కరే గతంలో ప్రజాక్షేత్రంలో చేసిన అనుభవం ఉండగా మిగిలిన 55 మంది తొలిసారి తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ లు తమ  పార్టీ తరపున బరిలో నిలిపిన అభ్యర్థులు కోట్లకు పడగలెత్తిన వారే  కావడం విశేషం. గతంలో ఎన్నడు లేని విధంగా ఎమ్మెల్యే, ఎంపీల కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తామని ముందుగానే పార్టీలతో ఒప్పందాలు చేసుకున్న వారికే టికెట్లు ఇచ్చారని, గ్రాడ్యుయేట్ లలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కోట్లు కుమ్మరించేందుకు వెనుకాడకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 27న జరిగే ఎన్నికల కోసం కోట్ల రూపాయలను  మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు.  ఒక్కొక్క ఓటు కోసం వేల రూపాయలు ఇచ్చేందుకు తాయిలాలను సిద్దం చేశారనే ప్రచారం  జరుగుతుంది. ఇప్పటికే  ప్రధాన పక్షాలైన పార్టీలు తమ సీనియర్ లీడర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఓటర్లకు పంచేందుకు తాయిలాలు సిద్దంగా ఉన్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచే అభ్యర్థులు భవిష్యత్తులో పట్టభద్రుల, నిరుద్యోగుల ప్రాథమిక డిమాండ్ లు అయిన ఉచిత విద్య, వైద్యంపై ప్రభుత్వంను నిలదీసే గొంతుకలవుతారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గెలచిన తర్వాత పార్టీ ఆదేశాలను పాటిస్తారే కానీ విద్య, వైద్య పరంగా ప్రజలను, అవసరాలను తీర్చే విషయంలో చట్టసభల్లో మాట్లాడుతారా అన్న సంశయాలు ఉత్పన్నమౌతున్నయి. తాము ఖర్చు చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేది తమ సొంత రాజకీయ ప్రయోజనమే అనేది గతంలో చట్టసభలకు ఎన్నికైన అభ్యర్థులు రుడి చేశారు. ఈ నేపథ్యంలోనే కోటిశ్వరులు బరిలో  నిలిచిన ఎన్నికల్లో రాజకీయ గొడుగు కోసం బరిలో నిలిచిన అభ్యర్థుల పై ఓటర్లలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి.