Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 4:47 pm Posted by : ramakrishna

అలరించిన నృత్య ప్రదర్శన

బతుకమ్మ,కమ్మార్ పల్లీ: కమ్మర్ పల్లి మండలానికి చెందిన శ్రీ పరమేశ్వర నృత్య కళా నిలయానికి చెందిన చిన్నారులు యాదగిరిగుట్ట పై  కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన పోటీలో పాల్గొన్నారు. చిన్నారుల నృత్య కళారూపకం అందరినీ ఆకట్టుకుంది.  నృత్య ప్రదర్శన పోటీలో  కమ్మర్ పల్లి శ్రీ పరమేశ్వర నృత్య కళానిలయానికి చెందిన చిన్నారులు ఉత్తమ అవార్డు అందుకున్నారు.  శ్రీ పరమేశ్వర నృత్య కళానిలయానికి చెందిన గురువు శిరీషతో పాటు చిన్నారులను యాదగిరి గుట్టపై కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.