ఇందూర్, బతుకమ్మ :
బుస్స ఆంజనేయులు ప్యానెల్ పేరుతో మొత్తం 14 మంది పోటీలు చేస్తున్నామని వారిని ఎన్నికల్లో గెలిపించాలని బుస్సా ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్ లు కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆంజనేయులు, సుధాకర్ లు మాట్లాడుతూ . . . గత పది పదిహేను సంవత్సరాల నుండి తమ ప్యానల్లో మొత్తం 14 మంది రెడ్ క్రాస్ కొరకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నామని, అర్ధరాత్రి అపరాత్రి అయినా కూడా చూడకుండా రక్తం అవసరం ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో స్పందించి వేల ప్రాణాలు కాపాడిన వారేనని తెలిపారు. రెడ్ క్రాస్ అంటే కేవలం రక్తదాన సేవలకే పరిమితం కాకుండా తల సేమియా వార్డు, వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్, వివిధ హాస్టల్లో విద్యార్థులకు బ్లాంకెట్ల కంపెనీ ఇలా చాలా కార్యక్రమాలు గత పది సంవత్సరాలలో చేసామని ఆయన అన్నారు. సమాజానికి వివిధ రూపాల్లో సేవ చేస్తూ రెడ్ క్రాస్ తో రక్తసంబంధం ఉన్న ఈ ప్యానెల్ సభ్యులను గెలిపించి మరొకసారి సేవ చేసే అవకాశం ఇవ్వాలని బుస్స ఆంజనేయులు కోరారు. మొత్తం 14 మంది గెలిస్తేనే తమ పానెల్ అభ్యర్థి చైర్మన్ అవుతాడని, రెడ్ క్రాస్ ను ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని అన్నారు. తమ పానెల్ సభ్యులు రవీందర్, బి.ఆంజనేయులు, బచ్చబోయిడి గంగ కిషన్, బైరి విజయసాగర్, డి.వెంకటేశం, డొల్ల రాజేశ్వర్ రెడ్డి, గున్నల వెంకటేష్ గౌడ్, కరిపే రవీందర్, కుల్కర్ణి రమేష్ బాబు, ఎం.శ్రీనివాస్, ఎన్.కృష్ణ ,నీరడి వెంకటేశ్వర్లు, సైదు రమేష్, సుధాకర్ నరాలలను గెలిపించాలని కోరారు.