. . . డీఆర్వోను కలిసిన నిజామాబాద్ ఉద్యోగుల సమైఖ్య నాయకులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రమోషన్లలో రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు అయ్యే విధంగా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారిని గీత నిజామాబాద్ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసారు. శనివారం కలెక్టరేట్ లో ఉద్యోగుల సమైక్య నాయకులు డీఆర్వోకు రిప్రజెంటేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కోర్ కమిటీ సభ్యులు నాంపల్లి, జాతీయ ఉపాధ్యక్షులు సురేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మారుతి, నిజామాబాద్ జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు సైదు,లక్ష్మణ్, ఉపాధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్,కోశాధికారి బి. సహదేవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి, రిటైర్డ్ ఏవో గంగాధర్ పాల్గొన్నారు.