భూ భారతి రీ-సర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు

  ఫతేఫూర్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సాలురా, బతుకమ్మ : సాలూరా మండలం ఫతేఫూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న భూముల రీ-సర్వే (భూ భారతి) ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.వారి వెంట ఆర్డీవో విజయ కుమారి,మండల తహసీల్దార్ నవాజ్‌తో పాటు మండల అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.