బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం పీ టీ ఏం కార్యక్రమంను నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలరావు తెలిపారు. గ్రామస్తులతో, తల్లిదండ్రులతో విద్యార్థులకు కల్పిస్తున్న వివిధ వసతులను, ప్రోత్చాహకాలను తెలియజేసి 2025-26 విద్యా సంవత్సరం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలెం లో ఆరు నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగినది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహేష్ కుమార్ నచ్చయ్య, గంగాధర్,గ్రామ సెక్రెటరీ సంతోష్ కుమార్, అంగన్వాడి,ఆశ వర్కర్లు గ్రామస్తులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.