మరణానంతరం ఇద్దరికి కంటిచూపునిచ్చిన ఎనిమిరెడ్డి జ్యోతి

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   మరణానంతరం తన కళ్లను దానం చేసి మరో ఇద్దరికి కంటిచూపు ప్రసాదించిన కాలేపల్లి క్యాంపునకు చెందిన ఎనిమిరెడ్డి జ్యోతి ఆదర్శంగా నిలిచారు. అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నిజామాబాద్ జిల్లా నాయకుడు ఎనిమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భార్య అయిన జ్యోతి కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ, నిజామాబాద్‌లోని ప్రగతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. జ్యోతి మరణానంతరం తన కళ్లను...