Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 4:21 pm Posted by : ramakrishna

సమ్మేళనానికి ఇంగ్లీష్ భూమిక పోషిస్తుంది

  • తెయూ వైస్ ఛాన్స్లర్ టి.యాదగిరి రావు

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అంతర్జాతీయభాషల, సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్ భాష భూమిక పోషిస్తుందని తెయూ వైస్ ఛాన్స్లర్ టి.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో  సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాంను వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి యాదగిరిరావు  ప్రారంభించారు.  ఈ సందర్భంగా  మాట్లాడుతూ   సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్  ప్రతిరోజు  విద్యార్థులకు ఇంగ్లీషు భాష మీద శిక్షణ ఇస్తుందన్నారు. విద్యా వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఆధునిక కాలంలో  ఇంగ్లీష్ విద్య వలన అనేక ప్రయోజనాలతో పాటు  శక్తివంతమైన జ్ఞానాన్ని అందిస్తుందన్నారు. రోజురోజుకు ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారడంతో ఇంగ్లీష్ భాష యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు.  ఫలితంగా అంతర్జాతీయంగా విభిన్న సంస్కృతులకు, భాషలకు  ఇంగ్లీష్ భాష  ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.

English plays a role in integration.