Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2025, 6:02 pm Posted by : ramakrishna

ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఆంగ్ల భాషా దినోత్సవం

 బతుకమ్మ, ఏర్గట్ల: భారత కోకిల,నైటింగేల్ ఆఫ్ ఇండియా గా పేరుపొందిన సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆంగ్ల భాష దినోత్సవాన్ని ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆంగ్ల భాష లో  ఉపన్యాసాలు ఇవ్వడం,పాటలు పాడడం నాటికలు వేయడం,క్విజ్ పోటీలను కూడా నిర్వహించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  కృష్ణాచారి మాట్లాడుతూ నేటి కాలంలో ఆంగ్ల భాష నేర్చుకోవడం చాలా అవసరమని, ఉన్నత చదువులకు ఈ భాష ఎంతగానో ఉపయోగపడు తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నిర్వహిస్తుందని విద్యార్థులు ఆంగ్లభాష పై పట్టు సాధించాలని తెలిపాడు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరోద్దిన్,ప్రసాద్,పవన్, రాజశేఖర్,శ్రీనివాస్,విజయ్, రాజ నరసయ్య,రాజేందర్,గంగాధర్ శ్రీనివాస్,ప్రవీణ్ శర్మ,నరేష్, గంగమోహవ్,ట్వింకిల్,సమిత,సబిత, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.