Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 11:14 pm Posted by : ramakrishna

ఇందూర్ కు ఇంజనీరింగ్ కళాశాల

  • తెయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
  • నాలుగు కోర్సులతో కొత్తగా మూడవ విడత కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపు
  • హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థి లోకం

 

నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర తెలంగాణలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగిత్యాల జిల్లాలో జేఎన్ టియు అఫిలేటేడ్ ఇంజనీరింగ్ కళాశాల తరువాత నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. తెలంగాణ విశ్వ విద్యాలయం అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యధర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగు ఇంజనీరింగ్ కోర్సులతో మూడవ విడత కౌన్సిలింగ్ లో 60 చొప్పున 240 సీట్లను భర్తీ చేయనున్నారు. కొత్త ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఇదివరకే తెలంగాణ విశ్వవిద్యాలయం అధికారులు సిద్ధం కావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వైస్ చాన్స్ లర్ ప్రొ.యాదగిరి రావు తెలిపారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యా ఏర్పాటు కల దశాబ్ధాలుగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 65 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేశారు. 2004 లో అనుబంధంగా మూడు పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేశారు. కాని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడంతో పేద విద్యార్ధులు ఇంజనీరింగ్ విద్యకు దూరమై పాలిటెక్నిక్ డిప్లొమాలతోనే సరిపెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ఇంజనీరింగ్ కళాశాల లేక ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల విద్యార్ధులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. 2009 లో నిజామాబాద్ లో తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయగా ఆనాటి నుంచే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు అనే డిమాండ్ బాగా పెరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నాటి నుంచి ఇంజనీరింగ్ విద్యకు హైద్రాబాద్ లేదా ప్రైవేట్ లో చదువాలనే పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ విద్యార్థులది. తెలంగాణ విశ్వ విద్యాలయం తో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాల, లా కాలేజీలు సక్సెస్ ఫుల్ గా నడస్తుండటంతో ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన ఉదంతాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా యూనివర్సిటిలో అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు హమీ ఇవ్వగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందేకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఎఫ్ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైనప్పటికి మూడవ విడతలో కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపుతో పాటు క్లాస్ ల బోధనకు చక చకా ఏర్పాట్లు చేస్తుంది.

తెలంగాణ విశ్వవిద్యాలయం లో అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సీగ్నల్ రాగానే తమ పోరాటాలతొనే ఏర్పాటు జరిగిందని విద్యార్థి సంఘాలు పోటా పోటీగా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీలు తమ హయాంలోనే ప్రతిపాదనలు పంపామని ఇప్పుడు కొత్తగా ఏమి ఏర్పాటు కాదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సంబరాలను నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు విద్యార్థి, యూత్ కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ లో సంబరాలు నిర్వహించుకున్నారు. కాని దశాబ్థాల ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుతో జిల్లాలో ఉన్నత విద్యలో మరో మైలురాయికి చేరువైందని చెప్పాలి. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ విశ్వ విద్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు, రూద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంను డెవలప్ చేస్తే  వ్యవసాయ విద్యకు కూడా నిజామాబాద్ విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఐతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హమీని నేరవేరుస్తు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చెయ్యడాన్ని విద్యార్థి లోకం స్వాగతిస్తోంది. పేద విద్యార్ధులకు ఉచిత సర్కార్ ఇంజనీరింగ్ విద్యా అందడమంటే ఉన్నత విద్యా అవకాశాలు అందరికి సమానంగా అందించడంలో ప్రభుత్వ ఆశయం పట్ల విద్యార్ధులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Engineering college for Indore