నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని పూలాంగ్, బోధన్ రోడ్డు ప్రాంతంలో ఎండు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి నగరంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఎండు గంజాయి తో ఉన్న నిజామాబాద్ కు చెందిన షేక్ సమీర్, నగరంలోని పూలాంగ్ కు చెందిన రిజ్వాన్ లను పట్టుకొని వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకటేష్ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఈ దాడిలో ఎస్ఐ రాం కుమార్, సిబ్బంది భూమన్న, విఠల్, లక్ష్మి నరసయ్య, శివ కుమార్, సాయి కుమార్, శ్యాంసుందర్, ప్రకాశ్ లు పాల్గొన్నారు.