రేషన్ దుకాణాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీలు..

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని రేషన్ దుకాణాల్లో శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రేషన్ దుకాణాల్లో రేషన్ దారులకు బియ్యన్ని పంపిణీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం బియ్యం స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేషన్ దారులకు తప్పనిసరిగా మూడు నెలలకు బియ్యాన్ని అందించాలని రేషన్ డీలర్లకు సూచించారు.