Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 5:07 pm Posted by : ramakrishna

కాలభైరవుడిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్

 రామారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇసన్నపల్లి గ్రామంలో గల శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు.  బుధవారం  కమిషనర్ హన్మంతరావు కు ఆలయంలో వేద పండితుల  శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ హనుమంతరావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ ఇసన్న పల్లి లో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన క్షేత్రమని పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడం సంతోషకరమన్నారు. ఆలయానికి ఉన్న విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింతల శంకర్, ఏవో ప్రభు, రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, ఇసన్నపల్లి సర్పంచ్ దోతి లచ్చయ్య, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Endowments Department Commissioner visits Kalabhairava