Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 3:06 pm Posted by : ramakrishna

ముగిసిన ఇంటర్ పరీక్షలు 

 

. . . ద్వితీయ సంవత్సరంలో 398 మంది విద్యార్థులు గైర్హాజర్ 

 

. . . జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతం 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

2025 – 26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో ఇంటర్ ప్రధాన పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. రెండవ సంవత్సరం రసాయనశాస్త్రం, వాణిజ్య శాస్త్రం, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరగగా 97.5 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. జిల్లాల్లో మొత్తం 16,219 మంది విద్యార్థులకు గాను15,721 మంది హాజరయ్యారని 398 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని తెలిపారు. జనరల్ లో మొత్తం 14,085 మంది విద్యార్థులకు గాను 13,783 మంది విద్యార్థులు హాజరు కాగా ఒకేషనల్ లో 2,034 మంది విద్యార్థులకు గాను 1,938 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లాలో మొత్తం 58 పరీక్షా కేంద్రాలకు గాను 55 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని డిఐఈఓ తెలిపారు. 10 పరీక్ష కేంద్రాలను డిఐఈఓ , పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు14, హై పవర్ కమిటీ 5, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ లు మొత్తం 26 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షించారన్నారు. 17 పరీక్ష కేంద్రాల్లో వోకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు సోమవారం వరకు జరుగుతాయని ఆయన తెలియజేశారు. జిల్లాలో ఈ సారి పకడ్బందీ చర్యల ద్వారా ఎలాంటి కాపియింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, హైపర్ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్స్ స్క్వాడ్ బృందాలు నిరంతరం జిల్లాలోని 58 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తూ పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు. ఈసారి జిల్లాలో ఒకే విద్యార్థి పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు అయ్యిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు పోస్టల్ డిపార్ట్మెంట్, విద్యుత్తు, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీస్ ఇతర అన్ని శాఖల సమన్వయం, సహకారంతో పరీక్షలను ఇంటర్ అధ్యాపక, అధ్యాపకేతర బృందం ప్రశాంతంగా నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణకు సహకరించిన అందరికి డిఐఈఓ రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.