నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని ఎల్లమ్మ గుట్ట బొబ్బిలి వీధి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు గా ఎండల సంతోష్ గురువారం ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే సంఘం ఐక్యత కోసం అందరూ కృషి చేయాలని, అందరి సలహాలు తీసుకుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం తనని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.