ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను తొలగించాలి
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్ మంగళవారం నిజామాబాద్ నగర శివారులోని నాగారం, గుండారం ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గుండారం గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి పలు ఆక్రమణలను కలెక్టర్ గమనించారు. వెంటనే వాటిని తొలగించాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా...