Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 7:28 pm Posted by : ramakrishna

పేద విద్యార్థులకు క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయం

  • ముగిసిన డీ ఎస్ స్మారక క్రీడా పోటీలు
  • ముగింపు క్రీడలకు హాజరైన ప్రముఖ దర్శకుడు తనయుడు ఆకాష్ పూరి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు జరిగిన మాజీమంత్రి దివంగత నేత డి శ్రీనివాస్ స్మారక క్రీడా పోటీలు  శుక్రవారం తో ముగిశాయి. కబడ్డీ, కోకో, వాలీబాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్ క్రీడల్లో గెలుపొందిన క్రీడా కారులకు ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. చిన్ననాటి నుండి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించడంఅభినందనీయమన్నారు. మాజీమంత్రి దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకుని నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ వారి తండ్రి జ్ఞాపకార్థం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు క్రీడాకారులకునగదు పురస్కారంతోపాటు బహుమతులను ప్రధానం చేయడం గర్వకారణం అన్నారు. గత నాలుగు ఐదు రోజులగా జరుగుతున్న క్రీడల్లో పేద క్రీడాకారులు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వీడియోలో మంచి ప్రతిభ కనబడటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా తమ తమ చదువులతోపాటు క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాలని ఆయన కోరారు. అలాగే టీఎస్ జన్మదినం సందర్భంగా ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన తండ్రి జ్ఞాపకార్థం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు నృత్యాలతో అలరించారు. అదేవిధంగా మ్యాజిక్ షో ప్రత్యేకంగాఆకట్టుకుంది.

Encouraging athletes for poor students is commendable