జమ్మూకశ్మీర్ లో ’ఆపరేషన్ మహాదేవ్‘ చేపట్టిన భారత సైన్యం
వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్మూకశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్ జరుగుతోంది. శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పలు కొనసాగుతున్నాయి. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం రావడంతో ’ఆపరేషన్ మహాదేవ్‘ పేరుతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, భారతసైన్యం సీఆర్పీఎఫ్ సంయుక్తం గా ఈఆపరేషన్ చేపట్టింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భారత జవాన్‌లు ఎన్‌కౌంటర్ చేశారు.