సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్.. 12 మంది మావోల మృతి

సుక్మా, బతుకమ్మ :  ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం  భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో కుంటా ఏరియా కమిటీకి చెందిన సచిన్ మంగడు ఉన్నారు.  ప్రస్తుతం ఆ ప్రాంతంలో    ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.