Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 11:30 am Posted by : ramakrishna

చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్

 

. . . ఇద్ధరు మావోలు మృతి

చత్తీస్ గఢ్ , బతుకమ్మ :

 

ఛత్తీస్‎గఢ్‎లోని సుక్మా జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.కిష్టారామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మాయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్), సీఆర్‎పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.ఈ ఆపరేషన్ లోనే ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు.ఘటనాస్థలి నుంచి ఇప్పటివరకు ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ వెల్లడించారు.