హైదరాబాద్, బతుకమ్మ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన గజ్వేల్ ఇంజినీర్ ఇన్- చీఫ్ (ఈఎన్సీ) హరిరామ్ ను ఏసీబీ అధికారులు రెండో ప్రశ్నిస్తున్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు ఐదు రోజుల కస్టీడీకి అనుమతించగా.. శుక్రవారం విచారించగా సరిగా స్పందించలేదని తెలుస్తోంది. శనివారం రెండో రోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. హరిరామ్ ను అరెస్ట్ చేసిన అనంతరం అతడికి సంబంధించి అధికారికంగానే సుమారు రూ.13 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తుల్ని ఏసీబీ గుర్తించింది.