ఆగిన పేదోడి ఉపాధి
గ్రామాల్లో ఆగిపోయిన ఉపాధి హామీ పనులు బతుకమ్మ,మోర్తాడ్: ఆగస్టు 20:*గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలకపాత్ర పోషిస్తుందని తెలపడంలో అతిశయోక్తి లేదు. గ్రామాల్లోని పేదలకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అండగా నిలిచిందని తెలుపడంలో సందేహం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ జీవనోపాధి వరమని అనవచ్చు. అటువంటి ఉపాధి పని నిలిపివేయడంతో గ్రామాల్లోని పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పని దినాలు పూర్తి.. ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి...