Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 5:32 pm Posted by : ramakrishna

పట్టణంలో ఉపాధి హామీ పనులను కల్పించి ఆదుకోవాలి

  • సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు

 

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా గురువారం పార్టీ కార్యాలయంలో శిక్షణ తరగతులను సిపిఎం నగర కార్యదర్శి సుజాత అధ్యక్షత వహించగా  ప్రారంభించి పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో పనులు తగ్గిపోవడంతో పేద ప్రజలు పట్టణాలకు వలసలు పెరుగుతున్నారని పట్టణాల్లో కూడా ఉపాధి లభించక అనేకమంది పేదలు ఇబ్బందులతో కుటుంబ పోషణ కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉపాధి అవకాశాలను పెంచటానికి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులను ప్రారంభించి ప్రజలను ఆదుకోవాలని అన్నారు. తద్వారా పేదరికం కొంతైనా తగ్గి వారికి ఉపశమనం కలుగుతుందని అన్నారు. అనేక శివారు కాలనీలో మొరికివాడల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేటాయించే నిధులు వర్గాలు నివసించే ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టడం ద్వారా మురికివాడల్లో తాగునీరు దొరకక మురికి కాలువలు నిర్మించలేక మురికి నీరు రోడ్లపైనే ప్రవహిస్తూ ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని విద్యుత్ సదుపాయం లేక రాత్రుల్లో సంఘవిద్రోశక్తులకు అడ్డాలుగా మారుతున్నాయని ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు నరేష్, అనిత, దీపిక, కార్యకర్తలు శ్రీదేవి, రేఖ  యశోద  అమృత స్వప్న సంధ్య, శంషుద్దీన్, అంజయ్య తదితరులతో పాటు కార్యక్రమం పాల్గొన్నారు.

Employment-guaranteed jobs should be provided and supported in the town.