Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2024, 5:29 pm Posted by : ramakrishna

ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ దుర్మరణం 

  • రోడ్డు పక్కన నిలబడి ఉండగా ఢీ కొట్టిన టిప్పర్
  •  మాచారెడ్డి లో ఘటన

బతుకమ్మ, మాచారెడ్డి:  రోడ్డు ప్రమాదంలో మాచారెడ్డి మండలం ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గురువారం దుర్మరణం చెందాడు. మట్టి రవాణా చేస్తున్న టిప్పర్  రోడ్డు పక్కన నిలబడిన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ ను ఢీ కొట్టడంతో  మరణించాడు.  పోలీసుల  కథనం ప్రకారం మాచారెడ్డి మండలంలో ఉపాధి హామీ లో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జై సింగ్   కామారెడ్డి నుంచి మాచారెడ్డి వస్తుండగా భవానిపేట మూలమలుపు వద్ద బైక్ ఆపి నిల్చొని ఉన్నాడు.  కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై భవాని పేట మూలమలుపు వద్ద  మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో కాళ్లకు, కడుపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. 108 లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమించడంతో  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు . చికిత్స పొందుతూ మృతిచెందారు. జై సింగ్ కు భార్య, మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు.