పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఉపాధి హామీ

బతుకమ్మ,మోర్తాడ్: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి ఏర్పాటుచేసిన పతకము ఉపాధి హామీ పథకం అని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దీవి అన్నారు. అర్హులందరికీ పని కల్పిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపాధి హామీ పథకం కొంతవరకు తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే సోషల్ అడిట్ మోర్తాడ్ మండలం లోని దొంపాల్, వడ్యాట్, తిమ్మాపూర్, డొంకల్ నాలుగు గ్రామాల్లో మంగళవారం నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న కూలీల దగ్గరికి సిబ్బంది...