Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 4:04 pm Posted by : ramakrishna

పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఉపాధి హామీ

బతుకమ్మ,మోర్తాడ్: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి ఏర్పాటుచేసిన పతకము ఉపాధి హామీ పథకం అని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దీవి అన్నారు. అర్హులందరికీ పని కల్పిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపాధి హామీ పథకం కొంతవరకు తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే సోషల్ అడిట్ మోర్తాడ్ మండలం లోని దొంపాల్, వడ్యాట్, తిమ్మాపూర్, డొంకల్ నాలుగు గ్రామాల్లో మంగళవారం నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న కూలీల దగ్గరికి సిబ్బంది వెళ్లి పనికి వెళ్లిన వివరాలు, డబ్బులు వచ్చిన వివరాలు తదితర వివరాలు అడిగి తెలుకుంటూ నమోదు చేసుకని గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధర్,  పంచాయతీ కార్యదర్శి లక్ష్మి దుర్గ, డొంకల్ పంచాయతీ కార్యదర్శి స్వప్న, టెక్నికల్ అసిస్టెంట్ స్రవంతి, క్షేత్ర సహాయకులు రమేష్, హనుమాన్లు, అక్షయ్, డిఆర్పి శివరాం, ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్, ఉపాధి హామీ కూలీల, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Employment guarantee has brought light to the lives of poor people