ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం
సామాజిక తనిఖీలో బట్టబయలు తాడ్వాయి, బతుకమ్మ : తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామపంచాయితీ పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం అధికారుల సామాజిక తనిఖీల్లో బట్టబయలైంది. ఉపాధి హామీ పథకంలో చేసిన పనులపై 16వ విడత సామాజిక తనిఖీ గ్రామసభ గ్రామపంచాయతీ ఆవరణంలో శుక్రవారం ఎంపీడీవో, ఏపీవో, సామాజిక తనిఖీ డిఆర్పి ఎం.సాంబశివ చారి, బిఆర్పి కే.మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ తనిఖీలలో ఉపాధిహామీ పథకంలో క్షేత్ర సహాయకుడిగా విధుల నిర్వహిస్తున్న జి.బాలరాజు కుటుంబానికి పని...