బతుకమ్మ,మోర్తాడ్: గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పించడం జరుగుతుందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ కేంద్రంలోని గ్రామపంచాయతీలో జరిగిన గ్రామ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ, పాలెం, ధర్మోరా, సుంకేట్, మోర్తాడ్ ఐదు గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధర్, ఏపీవో శకుంతల, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబర్లు సాయన్న, పృథ్వీరాజ్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు చంద్రమోహన్, శ్రీనివాస్, శంకర్, జాన్సన్, పంచాయతీ సిబ్బంది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.