సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు సంఘటితంగా పోరాడాలి
టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ బోధన్, బతుకమ్మ : సమన్వయంతో, సంఘటితంగా ఉద్యోగుల సమస్యలపై పోరాడాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ పిలుపునిచ్చారు. టిఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ ఎస్ఎం. హుస్సేని ఆదేశాల ప్రకారం టీఎన్జీఓ బోధన్ తాలుకా యూనిట్ కార్యవర్గాన్నిమంగళవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నుకున్న బోధన్ యూనిట్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ యూనిట్ నూతన అధ్యక్షులుగా రాజశేఖర్ ( రెవెన్యూ శాఖ),...