టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్
బోధన్, బతుకమ్మ : సమన్వయంతో, సంఘటితంగా ఉద్యోగుల సమస్యలపై పోరాడాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ పిలుపునిచ్చారు. టిఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ ఎస్ఎం. హుస్సేని ఆదేశాల ప్రకారం టీఎన్జీఓ బోధన్ తాలుకా యూనిట్ కార్యవర్గాన్నిమంగళవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నుకున్న బోధన్ యూనిట్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ యూనిట్ నూతన అధ్యక్షులుగా రాజశేఖర్ ( రెవెన్యూ శాఖ), యూనిట్ కార్యదర్శిగా సాయిలు (వ్యవసాయ శాఖ), ఉపాధ్యక్షులుగా కిషోర్ (ట్రెజరీ శాఖ), గంగాధర్ (నీటిపారుదల శాఖ) తదితరులను కో ఆప్షన్ పద్ధతిన ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి ఎస్.దినేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు జి.సంజీవయ్య, అర్బన్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, మహేందర్ సలహాదారులు వనమాన సుధాకర్, యూనిట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
