ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, బతుకమ్మ : పోస్టల్ బ్యాలెట్ ఓటుహక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ కేంద్రంలో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఓటర్ ఫెసలిటేషన్ సెంటర్ ఈనెల 24 వరకు ఓటు వేయాలని సూచించారు....