ఉద్యోగులు సమస్యల చిట్టాతో రావాలి
టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యోగులు శాలువా, బొకేలతో కాకుండా ఉద్యోగ సమస్యల చిట్టాతోని మాత్రమే రావాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ తెలిపారు. నగరంలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొదటగా మలిదశ ఉద్యమకారుడు స్వర్గీయ శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకొని, టీఎన్జీవో జిల్లా కార్యవర్గం 2 నిమిషాలు మౌనం పాటించి, అమరవీరులను, ఉద్యమకారులను స్మరించుకొని,...