Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 8:45 pm Posted by : ramakrishna

ఉద్యోగులు సమస్యల చిట్టాతో రావాలి

  • టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యోగులు శాలువా, బొకేలతో కాకుండా ఉద్యోగ సమస్యల చిట్టాతోని మాత్రమే రావాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ తెలిపారు. నగరంలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.  సమావేశంలో మొదటగా మలిదశ ఉద్యమకారుడు స్వర్గీయ శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకొని, టీఎన్జీవో జిల్లా కార్యవర్గం 2 నిమిషాలు మౌనం పాటించి, అమరవీరులను, ఉద్యమకారులను స్మరించుకొని, అనంతరం ఎజెండా అంశాలపై, వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై సుధీర్గంగా చర్చించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడారు. పదవి బాధ్యతలు చేపట్టి నేటికీ నెల రోజులు గడుస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు  సమస్యల పరిష్కారానికి, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ప్రాథమిక సభ్యుడికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.  ఉద్యోగ మిత్రులు టిఎన్జీవో కార్యాలయానికి బొకేలు, శాలువాలతో రావద్దని, మీకున్న ఉద్యోగ సమస్యలతో వచ్చినట్టయితే, వాటిని మాత్రమే ఆత్మీయంగా స్వీకరించి, జిల్లా పరిధిలో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరిస్తూనే, క్లిష్టమైన సమస్యలను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి హుస్సేనిలకు తెలియజేసి వారితో సమన్వయపరచుకొని వాటిని పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ప్రాథమిక సభ్యులు టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని, విధిగా టీఎన్జఓ సభ్యత్వాన్ని పొంది, హక్కుల సాధన కొరకు పోరాడుటకు కలిసి రావాలని కోరారు. సుదీర్ఘ కాలం పాటు టీఎన్జీవో నందు వివిధ హోదాల్లో విధులు నిర్వహించి, బదిలీల కారణంగా ఇతర జిల్లాకు వెళ్లిన కారణంగా వారిని టీఎన్జీవోస్ పక్షాన శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, కేంద్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి సుంకరి దినేష్ బాబు, సలహాదారులు ఆకుల ప్రసాద్, వనమాల సుధాకర్, యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.