టీఎస్ యూటిఎస్ జిల్లా అధ్యక్షులు డి.సత్యానంద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: 317 జీఓ వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను, ఉద్యోగులకు వెంటనే సొంత జిల్లాలకు కేటాయించాలని టీఎస్ యూటిఎస్ జిల్లా అధ్యక్షులు డి.సత్యానంద్ డిమాండ్ చేశారు. జీఓ నెం 317 వల్ల స్థానికత కోల్పోయిన వారి న్యాయ దీక్ష కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా టీఎస్ యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు డి. సత్యానంద్ మాట్లాడుతూ మంత్రివర్గ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని అన్నారు. నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మేము అధికారంలోకి రాగానే 317 జీఓ వల్ల స్థానికత కోల్పోయిన వారిని 48 గంటల్లోనే సొంత జిల్లాలకు పంపిస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారని, నేటి ముఖ్యమంత్రి తన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్. రాజారామ్, జిల్లా కమిటీ సభ్యులు సోన్ పేట్ గంగాధర్ పాల్గొన్నారు.
