Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 7:52 pm Posted by : ramakrishna

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన…

 

రుద్రూర్, బతుకమ్మ :

 

టీఈజేఏసీ పిలుపు మేరకు రుద్రూర్ మండలంలో మధ్యాహ్న భోజన సమయంలో పీఆర్సీ సహా అన్ని డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ  శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట వివిధ శాఖల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ తారబాయి కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పీఆర్సీ, ఆరు డిమాండ్లు సీపీఎస్ రద్దు, ఆరోగ్య భీమా సౌకర్యం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.