ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళటంలో ఉద్యోగులదే ముఖ్య పాత్ర

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరువ కావాలంటే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకం అని, ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకి వారదులుగా పాత్ర పోషిస్తారని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న డిఎ పిఆర్సి పరిష్కరించాలని చర్చించామని తెలిపారు.  ప్రభుత్వం ప్రజలకి చేరువ కావాలంటే ఉద్యోగులుగా వారదులుగా ఉంటారని...