Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 August 2025, 10:08 pm Posted by : ramakrishna

ఘనంగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జన్మదిన వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో గల టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకులు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రూపొందించి గాయకుడు అష్ట గంగాధర్ పాడిన పాటను మారం జగదీశ్వర్ చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు.  టీఎన్జీవో నిజాంబాద్ జిల్లా పక్షాన దీక్ష వస్త్రంతో ఘనంగా సన్మానించి, డ్రై ఫ్రూట్ బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి,  ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, భీంగల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, సర్వే స్పెషల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యప్రకాష్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.