Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 6:54 pm Posted by : ramakrishna

అత్యవసర కమిటీ చైర్మన్ ను కలిసిన ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అత్యవసర కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మెటల్ ను మంగళవారం ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన అత్యవసర కమిటీని ఏర్పాటు చేసి, ఉద్యోగ సంఘాల నాయకులతో ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఏడు రోజుల్లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన, మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని బుధవారం సా.4 గం. లకు చర్చలకు రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ పాల్గొన్నారు.

Employees JAC leaders meet with the Emergency Committee Chairman