Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 7:58 pm Posted by : ramakrishna

ఉగ్రదాడిని ఖండిస్తూ ఎంప్లాయిస్ జేఏసీ క్యాండిల్ ర్యాలీ

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్, పెహల్గాం ఉగ్రవాద ఘటనను ఖండిస్తూ ఈ ఘటనలో మరణించిన సామాన్య ప్రజలకు, యాత్రికుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ టీఎన్జీవో జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన టిఎన్జీవో జిల్లా కార్యాలయం నుండి ధర్నా చౌక్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.  అనంతరం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ…. ఎల్లప్పుడూ ఉద్యోగుల సమస్యలపైనే ఎప్పటికప్పుడు స్పందిస్తూనే, సమాజంలో జరుగుతున్నటువంటి దాడులను అమానుష ఘటనలకు మేము సైతం శాంతియుత వాతావరణంలో ఖండిస్తూ, ఉగ్రవాద  చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మరణించిన  కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి దినేష్ బాబు, టిఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, భీమ్గల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, బోధన్ యూనిట్ అధ్యక్షులు రాజశేఖర్, సర్వే యూనిట్ జిల్లా కార్యదర్శి సతీష్ కుమార్, ఎస్సారెస్పీ యూనిట్ అధ్యక్షులు ప్రవీణ్ రాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అతిక్ అహ్మద్, మంజుల, జాఫర్ హుస్సేన్, మహేందర్, పద్మ, ఇందిర, ప్రకాష్, లక్ష్మీనారాయణ, భూమయ్య, గీతారెడ్డి, విజయలక్ష్మి, శ్రీ వేణి, పారిజాతం ,సునీల్, స్వామి, క్లాస్ ఫోర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, వీరేందర్ సింగ్, వివిధ శాఖల ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులు, వివిధ శాఖల ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.