Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 4:40 pm Posted by : ramakrishna

ఉద్యోగుల డిమాండ్లను అసెంబ్లీలో ప్రస్తావిస్తా

 

. . . ఎన్ హెచ్ఎం సిబ్బంది ధర్నాకు ఎమ్మెల్యే ధన్ పాల్ మద్దతు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావిస్తానని  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కొనసాగుతున్న ధర్నాకు గురువారం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రెగ్యులరైజ్డ్ చేసినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఉద్యోగులంతా న్యాయమైన డిమాండ్లను కోరుతున్నారని వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానన్నారు. ముఖ్యంగా ఇంక్రిమెంట్లతోపాటు బోనస్ కూడా ప్రకటించాలన్నారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగి మరణించినట్లయితే ఇన్సూరెన్స్ తో కుటుంబంలో ఒకరికి విద్యార్హతను బట్టి ఉద్యోగం కల్పించాలన్నారు. ధర్నాలు ఎన్ హెచ్ ఎం జిల్లా అధ్యక్షులు సందీప్, నారాయణ, అక్షయ్, విశాల తదితరులు పాల్గొన్నారు.

Employees' demands will be mentioned in the Assembly