Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 6:02 pm Posted by : ramakrishna

ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి

  • ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించాలని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ డిమాండ్ చేశారు. టీఎన్జీవో కేంద్ర కార్యాలయం నాంపల్లి, హైదరాబాద్ నందు, ఎంప్లాయిస్ జేఎసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ అధ్యక్షతన, ఏర్పాటు చేసిన ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్ బిల్లుల విషయంలో చాలా ఆలస్యం అవుతున్నందున, ఉద్యోగులందరూ అసహనానికి గురవుతున్నారని అన్నారు. గత నెలలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారంగా త్వరితగతిన ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించాలని  కోరారు. రాష్ట్ర నాయకత్వం  తీసుకున్న నిర్ణయాలకు, భవిష్యత్ కార్యాచరణను నిజాంబాద్ జిల్లా పక్షాన స్వాగతిస్తామని తెలియజేశారు. ఈ సమావేశానికి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహ అధ్యక్షులు చిట్టి నవీన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి హాజరయ్యారు.