భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవా కేంద్రం ఏర్పాటు

మద్నూర్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం మద్నూర్ మండల ఎంపీడీఓ  కార్యాలయంలో మండల మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన వివిధ శాఖల మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఎలాంటి విపత్తును అయిన ఎదుర్కోవడానికి సంబంధిత శాఖల అధికారులు సిద్ధం కావాలని అన్నారు. ప్రజలు భారీ వర్షంలో వాగులు దాటడం, విద్యుత్ స్తంభాలను తాకడం,...