Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 6:35 pm Posted by : ramakrishna

పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు ఎంబ్రాయిడరీ మిషన్ అందజేత

కామారెడ్డి, బతుకమ్మ : రోటరీ క్లబ్ అఫ్ కామారెడ్డి సాహకారంతో  పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు శుక్రవారం గర్గుల్ గ్రామంలో ఎంబ్రాయిడరీ మిషన్, రైతులకు తాటిపత్రులని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్  హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ మాట్లాడుతూ మహిళలకు ఉపయోగపడే ఎంబ్రాయిడరీ మిషన్ ను అందించిన రోటరీ క్లబ్, పీపుల్ ఫర్ ఇండియా వారిని అభినందించారు. ప్రభుత్వం ఎల్లవేళలా మహిళలకు సహకారాన్ని అందిస్తున్నదని తెలియజేశారు. విశిష్ట అతిథి  డిడబ్లుఓ ప్రమీల మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని తెలియజేశారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్  జైపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళల కుట్టు మిషన్స్,విద్యార్థులకు ట్యాబ్స్, ఉచిత వైద్య పరీక్షలు వీటితో పాటు రైతులకు ఉపయోగపడేటటువంటి  కార్యక్రమాలను చేయడానికి రోటరీ క్లబ్ ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షులు శంకర్,  సెక్రెటరీ సబ్బని కృష్ణ హరి, ప్రోగ్రామ్ చైర్మన్ రాజనర్సింహారెడ్డి, ట్రెజరర్ రమణ కుమార్, పిఫ్ఐ మెంబర్ అరవింద్, ఎంఈఓ యోసేఫ్, రోటరీ మెంబర్స్ శ్రీశైలం, సుధాకర్, నవీన్ కుమార్ రైతులు భూమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Embroidery Mission presented to People for India NGO