ఎల్లారెడ్డి గవర్నమెంట్ హై స్కూల్ హెడ్మాస్టర్ సస్పెన్షన్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ హెడ్మాస్టర్ మాణిక్యంను సస్పెన్షన్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది వరకు విద్యార్థులు అస్వస్థత గురైన విషయం తెలిసిందే. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు వారు కోలుకుంటున్నట్టు తెలిపారు. గురువారం విద్యార్థులను ఎల్లారెడ్డి ఆర్డీఓ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా గురువారం అడిషనల్ కలెక్టర్...