Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 10:07 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి గవర్నమెంట్ హై స్కూల్ హెడ్మాస్టర్ సస్పెన్షన్

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ హెడ్మాస్టర్ మాణిక్యంను సస్పెన్షన్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది వరకు విద్యార్థులు అస్వస్థత గురైన విషయం తెలిసిందే. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు వారు కోలుకుంటున్నట్టు తెలిపారు. గురువారం విద్యార్థులను ఎల్లారెడ్డి ఆర్డీఓ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా గురువారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల లో మధ్యాహ్నం భోజనం వికటించిన విషయం తెలుసు కొని జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై చర్యలకు ఆదేశించారు.  అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయుడు మాణిక్యం ను  సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Ellareddy Government High School Headmaster Suspension