వెబ్ న్యూస్, బతుకమ్మ : మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ ఆఫీసులో లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. వెంచర్ అనుమతి కోసం రూ. ఐదు లక్షలు రాధాకృష్ణ డిమాండ్ చేశాడు. శనివారం రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా రాధాకృష్ణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇప్పటికే రూ. లక్ష అడ్వాన్సుగా రాధాకృష్ణ రెడ్డి తీసుకున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.